ఒక్కసారి జనసేన వైపు చూడండి

ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ వైఎస్ జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు దాదాపు ఇలాంటి స్లోగన్ నే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు పవన్. ఈ సందర్భంగా కుల రాజకీయాలను ప్రస్తావించారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధిపై ప్రశ్నిస్తుంటే సీఎం జగన్ తనకు కులం రంగు పులుముతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పదవి కావాలనుకుంటే.. 2009లోనే ఎంపీ అయ్యేవాడిని. ఒక్క కులం చూసుకుని రాజకీయం చేసి ఉంటే జనసేనకు 40 సీట్లు వచ్చి ఉండేవన్నారు. కుల, మతాలు లేని రాజకీయాలు రావాలని పవన్ ఆకాంక్షించారు. రాజకీయాల మార్పు గురించి ప్రజలు ఆలోచించాలి. ప్రజలు మౌనంగా ఉంటే వ్యవస్థలు మారవు. ఒక్కసారి జనసేనవైపు చూడమని ప్రజల్ని కోరుతున్నానని పవన్ అన్నారు.