#Zee5లో కార్తికేయ 2

నిఖిల్ హీరోగా చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన సినిమా ‘కార్తికేయ 2’. బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఒక్క తెలుగులో మాత్రమే కాదు.. బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.. ఈ సినిమా. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ సినిమాలతో  బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతోంది.

రోజు రోజుకి ఈ సినిమా షోస్, కలెక్షన్స్ పెరుగుతున్నాయి. తొలిరోజు హిందీలో 157 షోస్ పడ్డాయి. కేవలం రూ. 7 లక్షల కలెక్షన్స్ వచ్చాయి. అయితే హిట్ టాక్ తో రెండో రోజు అనూహ్యంగా పుంజుకుంది. ఆదివారం 245 షోస్ పడ్డాయి. కలెక్షన్స్ రూ. 28 లక్షలకు పెరిగాయి. అంతే దాదాపు 300 శాతం గ్రోత్ అన్నమాట

తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అప్ డేట్ కూడా వచ్చేసింది. కార్తికేయ 2 పోస్ట్ థియేట్రికల్ ఓటీటీ రైట్స్ ను జీ5 సొంతం చేసుకుంది. అయితే థియేటర్స్ లో రిలీజైన సినిమా ఓటీటీలోకి రావాలంటే కనీసం 8 వారాలు అంటూ ఇటీవల గిల్డ్ కొత్త నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రెండు నెలల తర్వాత కార్తికేయ 2 జీ5లో స్ట్రీమింగ్ కానుంది.