సారా-జాన్వీ.. షాకింగ్ న్యూస్

బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ జాన్వీ కపూర్, సారా అలీఖాన్ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారు. ఇటీవల ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కలిసి కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా తామిద్దరం కలిసి తెరను పంచుకోబోతున్నట్టు తెలియజేశారు.

ఇక ఈ విషయం పక్కనపెడితే.. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు కలిసి ఓకే చైర్ లో కూర్చొన్నారు. ఏదో షాకింగ్ న్యూస్ విన్నట్టు ఎక్స్ ప్రెషన్ పెట్టిన ఈ పిక్ ఆకట్టుకుంటోంది. ఇద్దరిలో ఎవరి చూడాలో అర్థంకానీ పరిస్థితుల్లో నెటిజన్లు ఉన్నారు. అంత ముద్దుగా ఉన్నారు ఇద్దరు ముద్దుగుమ్మలు.

ఇక ‘ధడక్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఆమె ప్రస్తుతం రూహీ, తక్త్, హెలెన్ సినిమాల్లో నటిస్తోంది.

తొలి సినిమా ‘కేధార్ నాధ్’ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది సారా అలీఖాన్. ఆ తర్వాత సింబా, లవ్ ఆజ్ కల్, కూలీ నెం.1, Atrangi Re చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం విక్కీ కౌశల్ కి జంటగా ఓ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉట్టేకర్ దర్శకత్వం వహిస్తున్నారు.