హాలీవుడ్ లుక్ లో తమన్నా

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బాలీవుడ్ లోనూ పలు సినిమాలు చేసింది. అక్కడ ఈ ముద్దుగుమ్మకు ఫాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడు ముంబై వెళ్లిన ఆమెను మీడియా చుట్టుముడుతుంది. ఇప్పుడీ.. ముద్దుగుమ్మ హాలీవుడ్ లో పరిచయాలు పెంచుకుంటోంది. #TheRingsOfPower సీజన్ 1 త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

శుక్రవారం రాత్రి ముంబైలో జరిగిన ఈ సినిమా ప్రీమియర్ షోకు హృతిక్ రోషన్ తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. సౌత్ నుంచి మిల్కీ బ్యూటీ తమన్నా ఈ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా లైట్ గ్రీన్ కలర్ డ్రెస్ లో హాలీవుడ్ హీరోయిన్ గా తయారైంది తమ్మూ. ఈ సందర్భంగా స్పెషల్ ఫోటో షూట్ కూడా చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక తమన్నా లెటెస్ట్ ఫిల్మ్ బబ్లీ బౌన్సర్ నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది.

