అమిత్ షా.. దీనికి రేపు సమాధానం చెప్పాలి !

మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ పార్టీల ఎన్నిక కాదు.. రైతుల బతుకుదెరువు ఎన్నిక అన్నారు సీఎం కేసీఆర్. మునుగోడులో ఏర్పాటు చేసిన ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రం తీరును మరోసారి ఎండగట్టారు. ఏ మొహం పెట్టుకొని అమిత్ షా మునుగోడుకు వస్తున్నారు. ముందు  కృష్ణా జలాల్లో మా వాటా ఎంతో చెప్పాలి? దీనికి రేపటి సభలో అమిత్ షా సమాధానం చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. 

తెలంగాణ వచ్చాక మిషన్‌ భగీరథ ద్వారా మంచినీళ్లు తెచ్చుకున్నాం. కానీ, సాగు నీరు రావాలి. నల్లగొండ జిల్లా ఉండేది కృష్ణా బేసిన్‌లో. డిండి, శివన్న గూడెం, శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా నీరు రావాలి. ఇది ఆషామాషీ విషయం కాదు. కృష్ణాలో మావాటా  తేలిస్తే చకా చకా నీళ్లు తెచ్చుకుంటాం. మునుగోడు చైతన్యవంతమైన గడ్డ. రైతులు చైతన్యవంతులై ఉన్నారు. కేంద్ర హోం మంత్రిని డిమాండ్‌ చేస్తున్నా.. మీ కేంద్ర ప్రభుత్వం పాలసీ ఏంటి? కృష్ణా జలాల్లో వాటా ఎంతో చెప్పాలి? అని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజీపే వచ్చి 8ఏళ్లు అయింది. దేశంలో ఏ ఒక్క మంచి పని అయినా జరిగిందా? ఎయిర్‌పోర్టులు, రైళ్లు, బ్యాంకులు అమ్ముతున్నారు. ఇక మిగిలింది..  రైతులు, భూములు, వ్యవసాయ పంటలు. మన నోట్లో మన్ను పోసే కార్యక్రమం జరుగుతోంది. జాగ్రత్త పడదాం అన్నారు కేసీఆర్.

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా ఏ మొఖం పెట్టుకొని మునుగోడుకు వస్తున్నారు.. అమిత్ షా రేపు సమాధానం చెప్పాలి : సీఎం శ్రీ కేసీఆర్#MunugodeWithTRS pic.twitter.com/jb93W9v4uQ— TRS Party (@trspartyonline) August 20, 2022