రెండో వన్డేలో టీమిండియా గెలుపు.. సిరీస్ కైవసం

హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను టీమ్ఇండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 161 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ ఐదు వికెట్లను కోల్పోయి 25.4 ఓవర్లలో 167 పరుగులు చేసి గెలిచింది. సంజూ శాంసన్ (43*), శిఖర్ ధావన్ (33), శుభ్మన్ గిల్ (33), దీపక్ హుడా (25) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో లూక్ జాగ్వే 2.. తనక చివాంగ, నైయుచి, సికిందర్ రజా తలో వికెట్ తీశారు. మూడో వన్డే సోమవారం జరగనుంది.