బీస్ట్ మోడ్ ఆన్

సూపర్ స్టార్ మహేష్ బాబు షర్ట్ విప్పడం, కండలు చూపించడం చాలా అరుదు. తెరపై ఇప్పటి వరకు ఆయన షర్ట్ విప్పింది లేదని చెప్పాలి. సిక్స్ ప్యాక్ చేసినా.. షర్ట్ విప్పి బీస్ట్ మోడ్ లో కనిపించింది లేదు. అలాంటిది.. షర్ట్ విప్పి బీస్ట్ మోడ్ లో ఉన్న మహేష్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

సిమ్ సూట్ లో కనిపిస్తున్న మహేష్.. పర్ఫెక్ట్ బాడీ తో కనిపిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ తదుపరి సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నిర్మాతల మండలి షూటింగ్స్ బంద్ ను ఎత్తేవేయడమే ఆలస్యం #SSMB28 రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. ఈ సినిమా కోసం సరికొత్త లుక్ లోకి మారిపోయాడు మహేష్. అంతేకాదు.. పర్ ఫెక్ట్ బాడీ షేప్ కోసం  గతంలో ఎన్ టీఆర్ ఫిజికల్ ట్రైనర్ గా పని చేసిన వ్యక్తిని నియమించుకున్నాడు. కొన్నాళ్లుగా కసరత్తులు చేస్తున్నారు. అప్పుడే ఫలితం కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీస్ట్ మోడ్ ఆన్ అంటూ మహేష్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక #SSMB28 లో మహేష్ కి జంటగా పూజా హెగ్డే నటించనుంది. మరో హీరోయిన్ కూడా అవకాశం ఉంది. ఆ అవకాశం ఎవరికి దక్కింది అన్నది తెలియాల్సి ఉంది. అతడు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కనుందని… అర్జునుడు, పార్ఠు అనే టైటిల్స్ కూడా ప్రచారం లో ఉన్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.