రకుల్ పింక్ లవ్

బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ హవా మొదలైంది. ఈ ఏడాది మొత్తం తొమ్మిది సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ నటిస్తుండగా.. ఇందులో ఏడు హిందీ సినిమాలే. మిగిలిన రెండు సినిమాల్లో ఒకటి ‘అయాలన్’ తమిళ సినిమా కాగా.. ’31 అక్టోబర్ లేడీస్ నైట్’ (తెలుగు/తమిళ్) ద్విభాషా చిత్రం. ఇక హిందీలో రకుల్ నటిస్తున్న ఏడు సినిమాల్లో ఇప్పటికే అటాక్, రన్ వే 34 ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అయితే ఆశించిన స్థాయిలో ఆడలేదు.

రెండు పోయిన మరో నాలుగు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయనే ధీమాతో రకుల్ ఉంది. ఇక అక్షయ్ కుమార్ కు జంటగా రకుల్ నటించిన #Cuttputlli సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ పింక్ డ్రెస్ లో కలర్ ఫుల్ గా కనిపించింది. మూడ్నాలుగు భంగిమల్లో క్లీవేజ్ అందాలు ఆరబోసింది. కసి కసిగా చూస్తే.. కుర్రకారుని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.

