వరుస ప్లాపులపై అక్షయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టుంది. ఈ ఏడాది ఆయన నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. బచ్చన్ పాండే, సమ్రాట్ పృథ్వీరాజ్, కొద్ది రోజుల క్రితం విడుదలైన రక్షాబంధన్ అన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందాయి. అయితే ఈ సినిమాల అపజయాల పట్ల ప్రేక్షకులు తననే నిందించాలని అక్షయ్ కోరారు.
శనివారం తన తాజా చిత్రం ‘కట్‌పత్లీ’ ట్రైలర్ విడుదల సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న అక్షయ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు సినిమాల పరంగా ఏం నచ్చుతుందో, వారేం కోరుకుంటున్నారో అర్థం చేసుకుని తదుపరి సినిమాల ద్వారా వారికది అందిస్తా. వచ్చే నెల(సెప్టెంబర్) 2న విడుదల కానున్న ‘కట్‌పత్లీ’(Cuttputlli) ప్రేక్షకులకు ఆ అనుభూతినిస్తుంది. నా కెరీర్‌లో ‘ఖిలాడీ’ మొదటి థ్రిల్లర్ చిత్రం. ఇది అంతకుమించి ఉంటుందన్నారు.
ఇక ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడం పట్ల అక్షయ్ వివరణ ఇచ్చారు. ఈ సినిమా ఓటీటీలో విడుదల చేయడం వెనుక కారణం ఈ సినిమా కష్టం అందరికీ చేరాలనే తప్ప రక్షణాత్మక ధోరణి ఎంత మాత్రం కాదన్నారు. 2018లో వచ్చిన తమిళ చిత్రం ‘రాక్షసన్’కు ‘కట్‌పత్లీ’ రీమేక్. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్ గా నటించారు. రంజిత్ ఎం తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్2న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. రాక్షసన్ తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘రాక్షసుడు’గా రిమేక్ అయిన సంగతి తెలిసిందే.
.@akshaykumar admits it is his “fault” if his films are not working and he needs to “make the changes, and understand what the audience wants.” #AkshayKumar #Cuttputlli #CuttputlliTrailer pic.twitter.com/uTqo0PdTK3— Indian Express Entertainment 😷 (@ieEntertainment) August 20, 2022