అమిత్ షాతో తారక్.. ఏం మాట్లాడారంటే ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకు కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా ఫిదా అయిన సంగతి తెలిసిందే. ఓ సారి తారక్ ని కలవాలని భావించిన అమిత్ షా.. ఆదివారం తెలంగాణ పర్యటనలో ఆ కోరిక తీర్చుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో అమిత్ షాతో ఎన్టీఆర్ సమావేశం అయ్యారు. దాదాపు అరగంట సేపు వీరి మధ్య సమావేశం జరిగినట్లు తెలిసింది. అంతేకాదు.. ఇద్దరు కలిసి డిన్నర్ చేశారట.

ఇక ఈ సమావేశంలో ఏమైనా రాజకీయాలు చర్చకు వచ్చాయా ? లేదంటే ఆర్ఆర్ఆర్ ముచ్చట్లు మాట్లాడుకున్నారా ? అన్నది తెలియాల్సి ఉంది. అమిత్ షా ను కలిసిన సమయంలో తారక్ లైట్ బ్లూ కలర్ షర్ట్, బ్లాక్ పాయింట్ తో ఫార్మల్ లుక్ లో కనిపించారు. అమిత్ షాతో కలిసి దిగిన రెండు ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. మరోవైపు రామోజీ ఫిల్మ్ సిటీలో అమిత్ షాతో రామోజీరావు భేటీ అయ్యారు. కొందరైతే.. చంద్రబాబు కూడా అక్కడే ఉన్నారనే కామెంట్స్ చేస్తున్నారు.

