బాయ్‌కాట్‌.. లైట్ తీసుకున్న లైగర్

ప్రస్తుతం బీటౌన్‌లో బాయ్‌కాట్‌ ట్రెండ్ కొనసాగుతోంది. అప్పుడప్పుడు #Bycottbollywood హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూ ఉండేది. ఇటీవల కాలంలో వచ్చిన దాదాపు ప్రతి సినిమాను #Bycott చేయాలనే పిలుపు వినిపిస్తోంది. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా విషయంలో ఈ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. స్టార్ కిడ్స్ సినిమాలు విడుదలవుతున్న సమయంలోనూ ఈ బాయ్ కాట్ పదాలు ట్రెండ్ అవుతున్నాయి. 

ఇప్పుడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ విషయంలోనూ బాయ్ కాట్ ఉద్యమం కొనసాగుతుంది. దీనికి కారణం.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ దేవరకొండ అమీర్ ఖాన్ ను సపోర్ట్ చేయడమే. బాయ్ కాట్ లాంటి ఉద్యమాలు అమీర్ సినిమాను ఆపలేవు అన్నారు. ఇది బాయ్ కాట్ ఉద్యమాన్ని నడిపిస్తున్న వారికి కోపం తెచ్చిపెట్టింది. దీంతో బాయ్ కాట్ లైగర్ అంటూ విజయ్ సినిమాపై పడిపోయారు. అయితే విజయ్ ఏ మాత్రం తగ్గలేదు. మన మాటల్లో నిజాయితీ ఉన్నప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు.

ఓ వైపు లైగర్ బాయ్ కాట్ అనే పదం వినిపిస్తుండగా, మరోవైపు లైగర్‌ టీం స్వేచ్ఛగా ప్రమోషన్స్‌లో పాల్గొనడం పట్ల హిందీ సినీ అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన లైగర్‌  చిత్రానికి కరణ్‌ జోహార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 25న దేశవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.