కోబ్రా.. గణితశాస్త్ర మేధావి కథ !

విలక్షణ నటుడు విక్రమ్ తాజా చిత్రం ‘కోబ్రా’. శ్రీనిధి శెట్టి కథానాయిక. ఇర్ఫాన్‌ పఠాన్‌ ముఖ్యభూమిక పోషించారు. ఆర్‌.అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో విక్రమ్‌ గణితశాస్త్ర మేధావిగా కనిపించనున్నారు.

ఈ సినిమాలో విక్రమ్ దాదాపు 20 రకాల విభిన్న గెటప్పులతో సందడి చేయబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని సెవన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తోంది. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.