మరో ‘ఎమర్జెన్సీ’ లుక్

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా పేర్కొనే ‘ఎమర్జెన్సీ కాలం’ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తయారవుతోంది. ఇందులో ఆమె ఇందిరాగాంధీగా నటిస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం, నిర్మాత కూడా కంగానే.

ఈ సినిమాకు సంబంధించిన పాత్రలను ఒక్కోక్కటిగా పరిచయం చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఇందిరాగాంధీ నమ్మినబంటు, ఆంతరంగికురాలు, రచయిత్రి అయిన పుపుల్ జయకర్ పాత్ర పోషిస్తున్న మహిమా చౌధురి గెటప్‌ను విడుదల చేశాయి సినీవర్గాలు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదల కానుంది.