షారుక్’తో రమ్యకృష్ణ స్వీట్ మెమోరీస్

సీనియర్ నటి రమ్యకృష్ణ మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ‘లైగర్’. ఈ వారమే (ఆగస్టు 25) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విజయ్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించారు. చాలా బలమైన పాత్ర అది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో తనకు పేరు తీసుకొస్తుంది అనే నమ్మకంతో రమ్యకృష్ణ ఉన్నారు. తాజాగా ఈ సినిమా బాలీవుడ్ ప్రమోషన్స్ లో ఆమె పాల్గొన్నారు. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘చాహత్‌’ (1996) ఈ చిత్రంలో రమ్యకృష్ణ లేడీ విలన్ పాత్రలో నటించారు. ఆనాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. షారుక్‌ ఒక స్వీట్‌హార్ట్‌. సంస్కారం తెలిసిన వ్యక్తి. చుట్టూ ఉన్న వారిని తన ప్రవర్తనతో ఇట్టే ఆకట్టుకుంటాడు. నేనప్పుడే హిందీ ఇండస్ట్రీకి పరిచయమవ్వడంతో సినిమా విషయంలో నాకు చాలా సహాయం చేశాడు. అతను రోజంతా ఫుల్‌ ఎనర్జీతో ఉంటాడు రణ్‌వీర్‌సింగ్‌లాగా’ అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌ 169వ చిత్రమైన ‘జైలర్‌’లో ప్రత్యేకపాత్రను పోషిస్తున్నట్లు ఆమె తెలిపారు.