Dobaaraa : నెగిటివ్ ప్రచారంపై తాప్సీ ఫైర్

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ.. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, ప్రయోగాత్మక సినిమాలకు ఆమె కెరాఫ్ అడ్రస్ గా మారారు. ఈ క్రమంలో అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో తాప్సీ నటించిన చిత్రం ‘దొబారా’. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది.

తాప్సీ నటన, కథ బాగున్నాయని కొందరు మెచ్చుకుంటే.. ‘దొబారా’ అసలేం బాలేదని.. మొదటి రోజు కేవలం రూ.8 లక్షలు మాత్రమే వసూళ్లు రాబట్టిందని, హల్దీరామ్‌ స్వీట్స్‌ షాప్‌ రోజువారీ ఆదాయం కూడా దీనికంటే ఎక్కువగా ఉంటుందని విమర్శిస్తూ కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.

తాజాగా ఈ ప్రచారంపై తాస్పీ స్పందించారు. ‘అబద్ధాన్ని కొన్ని వందలసార్లు నిజమని చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు. సినిమా పరిశ్రమ వల్ల గుర్తింపు తెచ్చుకున్న వీళ్లు.. ఇప్పుడిదే పరిశ్రమకు హాని కలిగిస్తున్నారు. వీళ్లేంత మూర్ఖులో చూడండి. ఇలాంటి వారికి ‘దొబారా’ చిత్రం అర్థం కావడం కాస్త కష్టమే. అలాంటప్పుడు వీళ్లనెలా తప్పు పడతాం’ ఫైర్ అయ్యింది.