మహేష్, బన్నీ, ఎన్టీఆర్.. వెయిటింగ్

టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ కొనసాగుతోంది. ఇండస్ట్రీలోని సమస్యలపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ చర్చలు జరుపుతోంది. అయితే షూటింగ్స్ తిరిగి ఎప్పుడు మొదలు అవుతాయి.. ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్దామా అని స్టార్ హీరోలు ఎదురు చూస్తున్నారు. మహేష్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాలు త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనులు ఇంకా కొనసాగుతుండగా… అల్లు అర్జున్, మహేష్ రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ‘పుష్ప: ది రూల్’ సెప్టెంబర్ తొలి వారం నుంచే చిత్రీకరణ మొదలు కానున్నట్టు తెలుస్తోంది. మహేష్ కూడా ఫారిన్ టూర్స్ ముగించుకొని తిరిగొచ్చారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఆయన సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి రెడీగా ఉంది. మహేష్, బన్నీ సినిమాలు సెప్టెంబర్ తొలి వారం నుంచే షురూ కానున్నాయి. ఎన్ టీఆర్ సినిమా సెప్టెంబర్ నెలాఖరు కల్లా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

