వైరల్ : అన్‌బ్రేకబుల్‌ తెలంగాణ

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. శనివారం మునుగోడు లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ విజయవంతం అయింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటిని నేటి బీజేపీ సమరభేరి సభలో అమిత్ షా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అమిత్ షా ఏం చెబుతారు ? అన్నదానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మునుగోడు వేదికగా సీఎం కేసీఆర్ అవినీతిని బట్టబయలు చేస్తామని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత సీరియస్ గా మార్చాయి.

మరోవైపు సోషల్ మీడియాలోనూ టీఆర్ ఎస్, బీజేపీ ల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కమలనాథులు పిలుపుస్తున్నారు. ఇక  తెలంగాణలో అమిత్ షా పర్యటన దృష్ట్యా #UnbreakableTelangana, #UnbreakableKCR పేరిట తీర్చిదిద్దిన వీడియోలు సామాజిక మధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. YSR పేరిట ఇవి దర్శనమిస్తున్నాయి. భారీగా ఏర్పాటు చేసిన కేసీఆర్‌ ఫ్లెక్సీలు, కటౌట్ వద్ద ఓవ్యక్తి నిల్చొని.. ‘అన్‌బ్రేకబుల్ తెలంగాణ’ అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తున్న వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. 

ఏం ముఖం పెట్టుకొని వస్తావ్ తెలంగాణకు? #TadipaarKaunHai

ఇది తెలంగాణ గడ్డ కేసిఆర్ అడ్డ.. #UnbreakableTelangana#UnbreakableKCR

జై తెలంగాణ.. జై కేసిఆర్… ✊🏻@KTRTRS@ysathishreddy @krishanKTRS @trspartyonline pic.twitter.com/cSAHXHLJCs— 𝓢𝓱𝓪𝓴𝓮𝓮𝓵.. (@Shakeel_Here) August 21, 2022