ఎదురొస్తే కొట్లాడటమే

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగాగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌  చిత్రం ‘లైగర్‌’. ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ జనాలు మరీనూ. లైగర్ సినిమా, విజయ్ దేవరకొండకు బాలీవుడ్ లో దక్కుతున్న ఆదరణ చూసి.. షాక్ అవుతున్నారు. అయితే అనూహ్యంగా లైగర్ పై నెగటివ్ ప్రచారం షురూ అయింది. బాయ్ కాట్ ఉద్యమం లైగర్ విషయంలోనూ కొనసాగుతోంది. దీనిపై విజయ్ శనివారం స్పందించారు.

‘లైగర్‌’ స్క్రిప్ట్‌ మనది, ప్రొడక్షన్‌ మనది. ‘హిందీలో మీరు విడుదల చేయండి’ అని కరణ్ జోహార్ ని కోరితే.. ఆయన ఓకే అన్నారు. ఈ సినిమా బాధ్యత తీసుకున్నారు. అసలు బాలీవుడ్‌లో ఏం గొడవ జరిగిందో పూర్తిగా నాకు తెలియదు. మేము కరెక్ట్‌గానే ఉన్నాం. ఏది ఎదురొచ్చినా కొట్లాడటమే. ఈ దేశం, ఈ ప్రజల కోసం ఏదైనా చేయడానికి సిద్ధం. కంప్యూటర్‌ ముందు కూర్చొని ట్వీట్లు కొట్టే బ్యాచ్‌ కాదు మేము అన్నారు. 

ఎవరో పైకి వెళ్తుంటే కాళ్లు పట్టుకుని కిందికి లాగే వాళ్లు మనకు వద్దు.. అందరి ప్రేమ ఉందని నేను అనుకుంటున్నా. అసలు ‘లైగర్‌’ కథేంటో తెలుసా? ఒక అమ్మ, తన బిడ్డను ఛాంపియన్‌ చేసి, జాతీయ పతాకాన్ని ఎగురవేయాలన్న కథతో సినిమా తీస్తే బాయ్‌కాట్‌ చేస్తారా? ఇలాంటి ఏమనాలో నాకే అర్థం కావటం లేదన్నారు విజయ్.