సుకుమార్‌తో రౌడీ సినిమా అప్‌డేట్‌

రౌడీ విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో వాలిపోయాడు. అక్కడ వరుస సినిమాలు చేస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా లైగర్ ఈ వారమే ప్రేక్షకుల  ముందుకు రానుంది. ఇక వీరి కాంబోలో రెండో పాన్ ఇండియా సినిమా ‘జేజీఎం’ ఇప్పటికే షురూ అయింది. అలాగే ‘లైగర్‌2’ కూడా తీసే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌-పూరి ఇద్దరూ చెప్పారు. మరోవైపు సమంత తో కలిసి విజయ్ ఖుషి చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో విజయ్ సినిమా ఎప్పుడు  ఉండనుంది ? లైగర్ ప్రమోషన్ లో పాల్గొన్న విజయ్ ని మీడియా ఇదే ప్రశ్న అడగ్గా.. సుకుమార్‌సర్‌ మొదట పుష్ప2 పూర్తి చేయాలి. ఆ తర్వాత మా సినిమా మొదలవుతుందని విజయ్‌ సమాధానం ఇచ్చాడు. పుష్ప 2 రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. బహుశా.. వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోపు విజయ్ ‘జేజీఎం’ పూర్తి చేసి.. సుకుమార్ తో జతకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.