‘జైలర్’ ఫస్ట్ లుక్.. అదిరింది

‘జైలర్ ‘గా సూపర్ స్టార్ రజినీకాంత్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో ‘జైలర్’ తెరకెక్కనుంది.

ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షురూ అయింది. ఇటీవలే రజనీ కాంత్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో రజిని ఫస్ట్ లుక్ రెడీ చేసి.. రిలీజ్ చేశారు. జైలర్ కథేంటీ ? రజిని మరోసారి మాస్ అవతారంలో కనిపించబోతున్నాడా ? అన్నది తెలియాలంటే.. జైలర్ థియేటర్స్ లోకి వచ్చే వరకు ఓపిక పట్టాల్సిందే. 

ఇక ఈ సినిమాలో రజిని కి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా జతకట్టనుంది అనే ప్రచారం జరుగుతుంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘నరసింహా’ చిత్రంలో నరసింహా-నీలాంబరి తరహా పోటా పోటీగా ఉంటాయట.