#NareshVijay2 : ‘ఉగ్రం’ ఫస్ట్ లుక్

అల్లరి నరేష్ తన మార్క్ నుంచి పూర్తిగా బయటికొచ్చి చేసిన సినిమా ‘నాంది’. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నటుడిగా నరేష్ ను మరో మెట్టు ఎక్కించింది. ఇప్పుడు నాంది దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో మరో రాబోతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ‘ఉగ్రం’ పేరు పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా వదిలారు.

సరికొత్త యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఒళ్లంతా రక్తంతో గర్జిస్తున్న అల్లరి నరేష్ ను చూడొచ్చు.  ‘నాంది’లో సెక్షన్ 211 గురించి చర్చించాడు దర్శకుడు. తాజా సినిమాలో మరో సెక్షన్ ను గురించి ప్రస్తావించే ఛాన్స్ ఉందని అంటున్నారు. షైన్ స్క్రీన్స్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.