బండి సంజయ్ అరెస్ట్, రాజాసింగ్ సస్పెన్షన్
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఆమె ఇంటి వద్ద సోమవారం నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు కమలం ర్యకర్తలను అరెస్ట్ చేస్తూ వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. దీనికి నిరసనగా మంగళవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం పామ్నూర్‌లో పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్ దీక్షకు దిగారు.
ఆయన దీక్షను భగ్నం చేసి పోలీసులు.. ఆయన్ని అరెస్ట్ చేశారు. సంజయ్ అరెస్ట్ ను బీజేపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఆయన చుట్టూ భద్రతా వలయంగా ఉండటంతో పాటు పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పాదయాత్ర శిబిరం వద్దకు వందలాది మంది పోలీసులు చేరుకున్నారు. చివరికి జయ్‌ను పోలీసులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యేకు బీజేపీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.