తిరుచ్చిలో ‘కోబ్రా’ టీమ్.. ప్రమోషన్ షెడ్యూల్ ఇదే !

విలక్షణ నటుడు విక్రమ్ తాజా చిత్రం ‘కోబ్రా’. ఈ చిత్రానికి ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ గణితశాస్త్ర మేధావిగా కనిపించనున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో వేగం పెంచిన చిత్రబృందం. దేశంలోని అన్ని ప్రధాన నగరాలు కవర్ చేసేలా ప్రమోషన్ షెడ్యూల్ ఫిక్స్ చేసింది. ఇందులో భాగంగా ఈరోజు తిరుచ్చి, మధురై లలో పర్యటించనుంది. ఇప్పటికే చియాన్ విక్రమ్ అండ్ టీమ్ తిరుచ్చిలో దిగిపోయింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక రేపు (ఆగస్టు 24) కోయంబత్తూరు, 25న చెన్నైలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్, 26న కొచ్చి, 27న బెంగళూరు, 28న హైదరాబాద్ లో కోబ్రా టీమ్ ప్రమోషన్స్ కొనసాగనున్నాయి. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. మరో హీరోయిన్ గా మృణాళిని రవి కనిపించనుంది. ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో విక్రమ్ దాదాపు 20 రకాల విభిన్న గెటప్పులతో సందడి చేయబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని సెవన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తోంది.


