వారియర్ డైరెక్టర్‌కు జైలు శిక్ష
తమిళ దర్శకుడు లింగుస్వామితో పాటు అతడి సోదరుడికి చెక్‌బౌన్స్ కేసులో చెన్నైలోని సైదాపేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్షను విధిస్తూ సోమవారం తీర్పును ఇచ్చింది.
పీవీవీ క్యాపిటల్ అనే సంస్థ నుండి తాను దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమా అవసరాల కోసం లింగుస్వామి అప్పుగా తీసుకున్నారు. ఆ డబ్బులను తిరిగి చెల్లించడానికి లింగుస్వామి ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో పీవీవీ క్యాపిటల్ కోర్టును ఆశ్రయించింది. లింగుస్వామితో పాటు అతడి సోదరుడు సుభాష్ చంద్రబోస్ లకు ఆరు నెలల జైలు శిక్షను విధిస్తూ సోమవారం తీర్పును వెలువరించింది.
సుదీర్ఘ విరామం తర్వాత మెగాఫోన్ పట్టాడు తమిళ దర్శకుడు లింగుస్వామి. రామ్ హీరో ది వారియర్ సినిమా తీశాడు. డాక్టర్ ఐపీఎస్ గా ఎంపికై సమాజంలోని నేరస్తులను ఎలా శిక్షించాడనే పాయింట్‌తో యాక్షన్ ఎంటర్టైనర్ గా వారియర్ తెరకెక్కింది. అయితే కథలో కొత్తదనం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ది వారియర్ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. అయితే ఓటీటీలో మాత్రం వారియర్ బాగానే ఆడింది. ఈ సినిమాలో రామ్ కి జంటగా కృతిశెట్టి నటించింది.