లైగర్ ప్లాప్ పై ఛార్మి కామెంట్స్

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన లైగర్ ను ప్లాప్ గా తేల్చేశారు ప్రేక్షకులు. ఈ నెల 25న రిలీజైన ఈ సినిమా ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చలేదు. అయినా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా తమ సినిమా రూ.33 కోట్లు వసూలు చేసినట్లే మేకర్స్‌ ప్రకటించారు. అయితే రెండో రోజు నుంచి కలెక్షన్లపై నెగటివ్‌ టాక్ ప్రభావం పడింది. తొలి వీకెండ్‌ ముగిసే సమయానికి లైగర్‌ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిపోయింది.

లైగర్‌ ఫెయిల్యూర్‌పై ప్రొడ్యూసర్లలో ఒకరైన ఛార్మీ కౌర్‌ స్పందించింది. ఇంట్లో కూర్చొనే ఒక్క క్లిక్‌తో మంచి కంటెంట్‌ చూసే అవకాశం ప్రేక్షకులకు ఉంది. టీవీల్లోనే పెద్ద బడ్జెట్‌ సినిమాలను కుటుంబం మొత్తంతో కలిసి చూసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ఎక్సైటింగ్ కంటెంట్‌ ఉంటే తప్ప థియేటర్లకు రావడం లేదు. కానీ బాలీవుడ్‌లో ఆ పరిస్థితి లేదు. ఆగస్ట్‌లో తెలుగులో బింబిసార, సీతారామం, కార్తికేయ 2 మంచి పర్ఫార్మెన్స్‌ చూపించాయి. ఇవన్నీ కలిపి రూ.150 నుంచి రూ.170 కోట్లు వసూలు చేశాయి. అలాగని సౌత్‌లో సినిమా పిచ్చోళ్లు ఎక్కువని చెప్పలేం” ఛార్మి అభిప్రాయపడింది.