చెంపదెబ్బ ఎఫెక్ట్ : మరోసారి హోస్ట్ గా చేసేందుకు క్రిస్‌రాక్ నిరాకరణ

ఈ ఏడాది ప్రారంభంలో యావత్ ప్రపంచం ఆస్కార్ అవార్డు వేడుకను ఆసక్తిగా తిలకిస్తోన్న సమయంలో వేదికపై క్రిస్‌రాక్ చెంప దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. తన  సతీమణి అనారోగ్యంపై జోకులు వేయడం తట్టుకోలేకపోయిన అగ్ర నటుడు విల్‌ స్మిత్‌.. క్రిస్ చెంప పగలగొట్టారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది (2023) ఆస్కార్‌ వేడుకల్లో వ్యాఖ్యాతగా అలరించేందుకు క్రిస్‌రాక్ నిరాకరించారు. ఇంకోసారి ఆస్కార్‌ వేడుకలకు వెళ్లడాన్ని నేరం జరిగిన ప్రాంతానికి తిరిగి వెళ్లడంగా పోల్చుతూ క్రిస్‌ స్పందించారని అరిజోనా రిపబ్లిక్‌ వెల్లడించింది.

తాజాగా ఆయన మరోసారి ఆస్కార్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించాలంటూ ఆఫర్ వచ్చింది. దీనిపై అరిజోనాలోని ఓ కామెడీ సెట్‌లో మాట్లాడుతూ.. ఇంకోసారి ఆస్కార్‌ వేడుకలకు వెళ్లడాన్ని నేరం జరిగిన ప్రాంతానికి తిరిగి వెళ్లడంగా పోల్చుతూ క్రిస్‌ స్పందించారని అరిజోనా రిపబ్లిక్‌ వెల్లడించింది.