బిగ్ బాస్ 6.. ఫస్ట్‌ గ్లింప్స్‌

ఈ ఆదివారం నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్-6 షురూ కానుంది. ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్‌ల ఎంపిక పూర్తయింది. అంతేకాదు, వారిని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు నిర్వహించే గ్రాండ్‌ ఎంట్రీ ఈవెంట్‌ను కూడా దాదాపు పూర్తి చేశారు.

తాజాగా ఇందుకు సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదలైంది. హోస్ట్‌గా మరోసారి కింగ్ నాగార్జున నే వ్యవహరించారు. ఈ కొత్త సీజన్‌లోనూ వినోదం పంచనున్నారు. ఈ సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున పారితోషికం బాగా పెరిగినట్లు సమాచారం. ఈసారి ఆయన రూ.15కోట్లు తీసుకుంటున్నారని టాక్‌. సెప్టెంబరు 4వ తేదీ నుంచి ‘బిగ్‌బాస్‌ సీజన్‌-6’ టెలికాస్ట్‌ కానుంది.