రొటీన్ ప్రభుత్వాలు వద్దు, బీజేపీ సర్కారును సాగనంపుదాం
రొటీన్ ప్రభుత్వాలు వద్దు. బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలి అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. బిహార్ పర్యటనలో భాగంగా పట్నాలో ఆ రాష్ట్ర సీఎం నీతీశ్ కుమార్‌తో కలిసి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. 8ఏళ్ల మోదీ పాలనలో దేశం పూర్తిగా నష్టపోయిందని విమర్శించారు. భారత్ ఏ రంగంలోనూ ప్రగతి సాధించలేదని.. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ దారుణంగా పతనమైందన్నారు.
భారత్‌ను మార్చే ప్రభుత్వం కావాలి. బీజేపీ పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయింది. అబద్ధాలతో పాలన సాగిస్తున్నారు. విపక్షాలను ఏకం చేసే విషయమై నీతీశ్‌తో చర్చించా. విద్వేషాలు సృష్టించే శక్తులు దేశానికి క్షేమకరం కాదు. చైనాతో పోలిస్తే, మనం ఎక్కడ ఉన్నాం. విద్వేషం పెరిగితే దేశానికి నష్టం. ప్రతిష్ఠాత్మక సంస్థ ఎల్‌ఐసీని ప్రైవేటీకరణ చేస్తారా? రైల్వే, ఎయిర్‌పోర్టులు.. ఇలా అన్నీ ప్రైవేటీకరిస్తున్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు.. చేశారా? నీతీశ్ కూడా బీజేపీ ముక్త్ భారత్ కోరుకుంటున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరం ఏకతాటిపై ఉన్నాం. ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఎన్నికల వేళ నిర్ణయిస్తాం. విస్తృత చర్చల ద్వారా నాయకత్వంపై నిర్ణయం తీసుకుంటాం అన్నారు కేసీఆర్.
త్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలు పెరిగి పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దేశంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. దేశ ప్రజలకు కనీసం తాగునీళ్లు ఇవ్వడం లేదు. దేశ రాజధాని దిల్లీలోనూ తాగునీరు, విద్యుత్ సమస్యను పరిష్కరించలేదు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల హామీ ఏమైంది? సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. దేశంలో వనరులు సమృద్ధిగా ఉన్నా.. వినియోగించుకోవడం లేదు. బేటీ బచావో… బేటీ పడావో.. నినాదం ఉన్నా.. అత్యాచారాలు ఆగడం లేదు. దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు.