ధమాకా రొమాంటిక్‌ గ్లింప్స్‌

త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సినిమా ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్‌. టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. వినాయక చవితి కానుకగా ఈ సినిమా నుంచి ఓ  రొమాంటిక్‌ గ్లింప్స్‌ వీడియో రిలీజైంది. శ్రేయస్‌ గ్రూప్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అనౌన్స్‌మెంట్ చేసింది.

ఈ గ్లింప్స్‌లో ఓ పెళ్లి జరుగుతుంటుంది. వధూవరుల వెనుక నిలబడిన రవితేజ.. శ్రీలీలకు అలా పక్కకు రమ్మంటూ సిగ్నల్స్‌ ఇస్తుంటాడు. మొదట రాను పో అంటూ మొహం తిప్పుకునే ఆమె.. ఆ తర్వాత సరే అంటూ తలూపుతుంది. ఇందులో శ్రీలీల ట్రెడిషనల్‌ ఎల్లో డ్రెస్‌లో చాలా అందంగా కనిపిస్తోంది. అటు రవితేజ కూడా హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. ఈ మూవీలో ఉండాల్సిన మాస్‌ ఎలిమెంట్స్‌తోపాటు పాటు రొమాన్స్‌ కూడా బాగానే ఉన్నట్లు తాజా గ్లింప్స్‌ చూస్తే అర్థమవుతోంది.