వీరమల్లు పవర్‌ గ్లాన్స్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే బహుమతులు రెడీగా ఉన్నాయి. ఎల్లుండి పవన్ బర్త్ డే కానుకగా రేపే జల్సా రీ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 500 కు పైగా స్క్రీన్లపై జల్సా ప్రదర్శించబడనుంది. ఇక క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు నుంచి సప్రైజ్ రాబోతుంది.

స్పెషల్‌ డే అయిన సెప్టెంబర్‌ 2 సాయంత్రం 5.45 గంటలకు ఓ గ్రాండ్‌, అగ్గి పుట్టించే హరి హర వీర మల్లు పవర్‌ గ్లాన్స్‌ వస్తోంది. ఈ మాసివ్‌ బ్లిట్జ్‌ కోసం సిద్ధంగా ఉండండి” అని మెగా సూర్య ప్రొడక్షన్స్‌ అనౌన్స్‌ చేసింది. ఈ మూవీలో పవన్‌ గతంలో ఎన్నడూ చూడని లుక్‌లో కనిపిస్తున్నాడు. కోహినూర్‌ డైమండ్‌ చోరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగా ఈ మూవీలో పవన్‌ కల్యాణ్‌ ఓ దొంగ పాత్రలో కనిపించనుండటం విశేషం. ఈ మూవీకి మ్యూజిక్‌ ఎంఎం కీరవాణి అందిస్తున్నాడు. పవన్‌ సరసన నిధి అగర్వాల్‌ నటించింది.