బ్రహ్మాస్త్రాన్ని పరిచయం చేసిన రాజమౌళి

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ – అలియా భట్ జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 1 : శివ’. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 9న రిలీజ్ చేయబోతున్నారు. తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల కానుంది. టాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదలకు ముందు విజన్ ఆఫ్ బ్రహ్మాస్త్ర (Vision of Brahmastra) పేరుతో ఈ సినిమా థీమ్‌ను పరిచయం చేశారు.

“హిందూ పురాణాల ఆధారంగా బ్రహ్మాస్త్ర కథను అయాన్ ముఖర్జీ తయారు చేశారు. ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. మన పురాణాలు, ఇతిహాసాల ఆధారం చేసుకుని అస్త్రావర్స్ రూపకల్పన చేశాడు. అస్త్రావర్స్ అంటే ఏంటంటే మన శాస్త్రాల ప్రకారం మనిషి మనుగడకు మూల కారణం పంచభూతాలు. అలాంటి పంచభూతాలను శాసించే శక్తి బ్రహ్మ శక్తి. బ్రహ్మాస్త్ర కథ.. అలాంటి బ్రహ్మశక్తి నుంచి పుట్టిన అస్త్రాల గురించి, వాటిని ప్రేరేపించే సూపర్ హీరోల గురించి ఉంటుంది. 
అలాంటి అస్త్రాలే వానరాస్త్ర, అగ్ని అస్త్ర, నంది అస్త్ర మొదలైనవి ఉంటాయి. ఈ అస్త్రాల ఉపయోగించే సూపర్ హీరోలు, వారి మధ్య సంఘర్షణలను విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించి అయాన్ అద్భుతంగా తెరకెక్కించాడు. వీటన్నింటికంటే ఈ సృష్టిలో అద్భుతమైన శక్తి ఒకటి ఉంది. అదే ప్రేమ. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎలాంటి శక్తినైనా ఎదుర్కోగలదు అని ఈ విజవల్ వండర్‌లో చూపించారు” అని జక్కన్న చెప్పుకొచ్చారు. 

Brahmāstra is one of its kind film in the Indian Cinema. After travelling with #BRAHMASTRA for the past 9 years, Ayan is finally bringing it on to the big screens on September 9th. pic.twitter.com/xxXDK1UqtX— rajamouli ss (@ssrajamouli) September 1, 2022