మామ సినిమా అల్లుడికి అడ్డం

మెగా హీరో పరిస్థితి చూస్తుంటే.. ‘అఆ’ సినిమాలో రావు రమేష్ తో త్రివిక్రమ్ చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తుంది. ‘శతృవులు ఎక్కడో లేర్రా…మన ఇంట్లోనే మన చుట్టూనే తిరుగుతూ వుంటారు’ ఇది అఆ లో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్. ఇప్పుడు మెగా హీరోల పరిస్థితి చూస్తుంటే అలాగే వుంది. వాళ్ల సినిమాలే వాళ్ల కాళ్లకు అడ్డం పడుతున్నాయి. పవన్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 1 న ‘జల్సా’ సినిమాను రెండు రాష్ట్రాల్లో స్పెషల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. థియేటర్ మీద థియేటర్, షో మీద షో యాడ్ చేసుకుంటూ వెళ్లిపోతున్నారు.

పవన్ ఫ్యాన్స్ క్రేజ్, ఊపు అలా వుంది. అంత వరకు ఓకె. కానీ జల్సా హడావుడి అయిన మర్నాడే అంటే 2న ‘రంగ..రంగ’ విడుదలవుతోంది. బుకింగ్ లు ఓపెన్ అయినా, మెగా ఫ్యాన్స్ అంతా జల్సా హడావుడి లో వున్నారు. అటు దృష్టి పెట్టడం లేదు. 1న ఇంత మెగా హడావుడి అయిన తరువాత మళ్లీ వెంటనే 2న ‘రంగ..రంగ’ మీద దృష్టి పెడతారా? అన్నది అనుమానం. ఒక రోజో రెండు రోజులో లేటుగా వెళ్తారు అనుకుంటే ఈ లోగా సినిమా నిలబడడానికి పాజిటివ్ టాక్ తో పాటు సూపర్ అనే టాక్ రావాలి. అప్పుడే మెగా ఫ్యాన్స్ కు ఊపు వస్తుంది. రంగ రంగ వైభవంగా థియేటర్లు నిండుతాయి.