‘లాల్‌ సింగ్‌ చడ్డా’ రూ. 100 కోట్ల నష్టం

ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ చిత్రం అట్టర్ ప్లాప్ అయింది. మొత్తం బడ్జెట్‌ రూ.180 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్‌రావ్‌ సహ నిర్మాతలు. ఇప్పటివరకు ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ కనీసం రూ.వందకోట్ల వసూళ్లను అందుకోలేదని బాక్సాఫీస్‌ వర్గాలు చెబుతున్నాయి. కేవలం రూ.70 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ సినిమాకుగానూ ఆమిర్‌ రెమ్యూనరేషన్‌ రూ.50కోట్లు కాగా, ఇప్పుడు ఆ మొత్తం సొమ్ముని వదులుకుని నిర్మాతలకు నష్టాన్ని తగ్గించాలనుకుంటున్నారట. ఇక ఈ చిత్రంలో కరీనాకపూర్‌ కథానాయిక కాగా, ప్రముఖ యువనటుడు నాగచైతన్య కీలకపాత్ర పోషించాడు. రిలీజ్ ముందు ఈ సినిమాపై భారీ హైప్ వచ్చింది. కానీ ఆ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది.