సమంతకు మరో బ్రేకప్
భర్త నాగ చైతన్యతో విడిపోయిన సమంత ఒంటరిగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమె గొంతు కూడా ఆమెకు దూరం కాబోతుంది. అవునూ.. సమంత, ఆమె స్నేహితురాలు, సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ని వేర్వేరుగా చూడలేం. ‘ఏమాయ చేసావె’’. తెలుగు తెరకు సమంత పరిచయమైన చిత్రం. ఈసినిమాలో సామ్ పోషించిన జెస్సీ పాత్ర అందరికీ గుర్తుండిపోవడానికి ముఖ్య కారణం ఆమె వాయిస్. జెస్సీగా ఆమె స్క్రీన్‌పై పలికించిన అందమైన హావభావాలకు తెర వెనుక అంతే అందంగా వాయిస్ అందించి మెప్పించారు గాయని చిన్మయి.
ఏమాయ చేసావె సినిమా తర్వాత సామ్ నటించిన ఎన్నో చిత్రాలకు ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇకపై సామ్ కు డబ్బింగ్ చెప్పను అనే చెప్పేసింది చిన్మయి. ఎందుకంటే ? ఇప్పుడు సామ్.. తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటోంది. అందుకు ఆనందంగా ఉంది. అందుకే సమంతకు నేను డబ్బింగ్ చెప్పే దశ ముగింపునకు వచ్చిందనుకుంటున్నానని అభిప్రాయపడింది.