రష్మిక-అమితాబ్‌.. పతంగుల పండుగ

అదృష్టం అంతే రష్మిక మందానదే. బాలీవుడ్ లో ఎంట్రీ సినిమానే బిగ్ బీ అమితాబ్ తో. రష్మిక -అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘గుడ్‌బై’. ఇందులో అమితాబ్‌ కుమార్తెగా రష్మిక కనిపించనున్నారు. నీనా గుప్తా, సాహిల్‌ మెహతా, శివిన్‌ నారంగ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వికాస్‌ బహల్‌ దర్శకత్వం వహించారు. ఏక్తా కపూర్‌ నిర్మాత.

శనివారం ‘గుడ్‌బై’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో పాటు రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలిపారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో అమితాబ్‌ – రష్మిక కలిసి పతంగులు ఎగురవేస్తూ కనిపించారు.