రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ దుర్మరణం
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ (54) కన్నుమూశారు. మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో సూర్యనది వంతెనపై ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొంది. సైరస్ మిస్త్రీ మరణంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. సంతాపం తెలిపారు.
మిస్త్రీ 1968 జులై 4వ తేదీన ముంబయిలో ప్రముఖ నిర్మాణరంగ దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ, పాట్సీ పెరిన్ దుబాష్ దంపతులకు జన్మించారు. సైరస్ మిస్త్రీ దక్షిణ ముంబయిలోని ప్రముఖ క్యాథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్‌లో ప్రాథమిక విద్యభ్యసించారు. యూనివర్శిటీ ఆఫ్ లండన్ నుంచి 1990లో సివిల్ ఇంజినీరింగ్ బీఈ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం లండన్ బిజినెస్ స్కూల్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం 1991లో కుటుంబ వ్యాపారమైన షాపూర్జీ పల్లోంజీ కంపెనీలో డైరెక్టర్‌గా చేరారు. 2006 నుంచి టాటా సన్స్‌కు డైరెక్టర్‌గా పనిచేసిన, ఆయన నవంబర్ 2011లో టాటా సన్స్‌కు డిప్యూటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు.
Shocked to know that Former Tata Sons chairman & Renowned business tycoon #CyrusMistry killed in road accident!
Deepest condolences to his family members. May he rest in peace.
Om shanti. 💐 pic.twitter.com/sUrg7RrSbF— YSR (@ysathishreddy) September 4, 2022