ఆజాద్ కొత్త పార్టీ.. హిందుస్థానీ

ఇటీవల గులాం నబీ ఆజాద్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఆయన కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం జమ్ములోని సైనిక్ ఫామ్స్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న దాదాపు 20,000 మంది పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి మాట్లాడిన ఆజాద్.. మా కృషితో కాంగ్రెస్‌ ఏర్పడింది గానీ.. ట్విటర్‌, కంప్యూటర్లతో కాదని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌పార్టీకి తన రక్తం ధారపోస్తే.. ఇప్పుడు ఆ పార్టీ  విస్మరించిందన్నారు. తమ పార్టీ జమ్ము-కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు, భూమి హక్కుల కోసం, స్థానికులకు ఉద్యోగాలు తీసురావడం కోసం పోరాడుతుందని తెలిపారు. ఇప్పటి వరకు పార్టీ పేరును నిర్ణయంచలేదన్నారు. జమ్ము కశ్మీర్‌ ప్రజలే పార్టీ పేరు, పతాకాన్ని నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా పార్టీకి హిందుస్థానీ పేరు పెడతానని తెలిపారు.