ఇండియన్ 2.. రకుల్ ఎంట్రీ

రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో బిజీ బిజీ. ఏకంగా ఏడు సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది ఎటాక్, రన్ వే 34, కల్ పుట్లీ లాంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. మరో నాలుగు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. సౌత్‌లో ప్రస్తుతం కమల్ హాసన్-శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ఇండియన్ 2 సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టిందీ ముద్దుగుమ్మ. ఈ విషయాన్ని రకులే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది. ఇండియన్ 2 బిగిన్స్ అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో పేర్కొంది.

మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమాలో కాజల్‌ను హీరోయిన్గా తీసుకున్నారు. కొన్ని నెలల పాటు షూటింగ్ కూడా జరిగింది. అయితే ఈ సినిమా సెట్స్‌లో ప్రమాదం జరగడం, డైరెక్టర్ శంకర్-నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో విభేదాలు తదితర కారణాల వల్ల ఈ సినిమా తాత్కాలికంగా వాయిదా పడింది. ఆ వివాదాలన్నీ సద్దుమణిగి మళ్లీ ఇండియన్ 2 సెట్స్ మీదకు వెళ్లింది.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
