రీ రిలీజ్‌ ట్రెండ్‌ – పవన్ నెం. 1

టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ షురూ అయింది. స్టార్‌ హీరోలు నటించిన ఒకప్పటి బ్లాక్‌బస్టర్‌, ఫీల్‌గుడ్‌ చిత్రాలను ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా సాంకేతిక మార్పులు చేసి రీ రిలీజ్‌ల రూపంలో అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇలా, 4కె వెర్షన్‌లో విడుదలైన మహేశ్‌బాబు ‘పోకిరి’, పవన్‌కల్యాణ్‌ ‘జల్సా’ అదరగొట్టాయి.

మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా (ఆగస్టు 9) ‘పోకిరి’ని రీ రిలీజ్‌ చేయగా.. రూ.1.73 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. దాదాపు 500 పైగా స్కీన్లపై ఆడింది. అంతేకాదు.. థియేటర్స్ లో ఫ్యాన్స్ ఎంజాయ్ చేసిన ఫోటోలు, వీడియోలు ఓ వారం, పది రోజుల పాటు చక్కర్లు కొట్టాయి. ఇక పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు పురస్కరించుకుని సెప్టెంబర్‌ 1న జల్సా ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేశారు.

కేవలం ఈ ఒక్కరోజే సుమారు 702 షోలు ప్రదర్శించారు. ఈ సినిమా ప్రదర్శించిన ప్రతిచోటా మంచి రెస్పాన్స్‌ లభించింది. ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందో సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులోనే రూ.3.20 కోట్లు వసూలు చేసిందని, రీ రిలీజ్‌లో ఒక సినిమా ఇన్నికోట్లు సాధించడం ఇదే తొలిసారి అని అంటున్నారు. ఇప్పటి వరకు రీ రిలీజ్ రికార్డ్ లో పవన్ నే నెంబర్ వన్ అన్నమాట.