భారత్ ఓటమికి కారణాలివే.. !
దాయాదుల పోరులో ఈసారి పాక్ దే పై చేయి. ఆసియాకప్ సూపర్-4లో.. ఉత్కంఠ పోరులో భారత్‌పై పాక్ విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్ ఐదు వికెట్లను నష్టపోయి 19.5 ఓవర్లలో 182 పరుగులు చేసి విజయం సాధించింది. రిజ్వాన్ (71), నవాజ్ (42) కీలక పాత్ర పోషించారు.
భారత్ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (28), రోహిత్ (28) ఫోర్లు, సిక్సర్లతో విరుచు పడ్డారు. దీంతో తొలి సగం ఓవర్లలో భారత్ దాదాపు 10 రన్ రేట్ మెయిన్ టైన్ చేసింది. అయితే రోహిత్, రాహుల్ కేవలం పది పరుగుల తేడాతోనే అవుటయ్యారు. ఆ తర్వాత కూడా రన్ రేటు తగ్గకుండా విరాట్ కోహ్లీ (60) చూసుకున్నారు. అయితే సూర్యకుమార్ యాదవ్ (13), రిషభ్ పంత్ (14), హార్దిక్ (0) విఫలమవ్వడం.. దీపక్ హుడా (16) ధాటిగా ఆడే క్రమంలో అవుటవ్వడంతో.. 200 దాటవలసిన భారత్ స్కోరు 181 కి పరిమితం అయింది.
మరోవైపు మొదట్లో పాక్ పేసర్లు ధారళంగా పరుగులు ఇచ్చినా.. ఆ జట్టు స్పిన్నర్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఓ వైపు క్రమంగా వికెట్లు తీస్తూనే.. రన్ రేటును తగ్గించే ప్రయత్నం చేశారు. పాక్ పేసర్లు కూడా త్వరగా కమ్ బ్యాక్ అయ్యారు. బంతులు వేగంగా వేయడం కంటే.. స్లో బంతులు వేసేందుకు ప్రయత్నించారు. అయితే ఇలాంటి పదుపు బౌలింగ్ వేయడంలో టీమిండియా బౌలర్లు ఫెయిల్ అయ్యారు. ఇదీగాక.. అనుభవం ఉన్న అశ్విన్ తీసుకోకపోవడం మరో మైనస్ గా మారింది. దినేష్ కార్తీక్ ను పక్కన పెట్టే.. పంత్ ను ఆడిస్తే.. జరిగిన మేలు ఏం లేదు. ఇవన్నీ టీమిండియా పరాజయానికి మూల కారణంగా చెప్పవచ్చు.