అప్పుడే నిజమైన ఆనందాన్ని పొందగలం

మనం సంతోషంగా ఎలా జీవించాలన్నది మన చేతుల్లోనే ఉంది. ఆ సంతోషాన్ని మనమే సృష్టించుకోవాలి అంటోంది యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. నిఖిల్ కి జంటగా ఆమె నటించిన కార్తికేయ 2 బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుంది. బాలీవుడ్ లోనూ బంపర్ కలెక్షన్స్ రాబడుతుంది. ఈ హ్యాపీ మూడ్ లో జీవితంలో ఎలా సంతోషంగా ఉండాలి అనే దానిపై ఓ పాఠమే చెప్పింది అనుపమ.

మనకు లభించిన దానితో సంతృప్తి చెందగలిగినప్పుడే నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాం. ప్రతి విషయంలోనూ నేను ఇలాగే ఆలోచిస్తా. నా దగ్గర లేని దాని గురించి.. నాకు దక్కని వాటి గురించి అదే పనిగా ఆలోచిస్తూ బాధ పడటం నచ్చదని అనుపమ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘18 పేజెస్’, ‘బటర్‌ఫ్లై’ నటిస్తోంది.