వైరల్ : రేషన్‌ కోసం బెంజి కారులో వచ్చిన పేదోడు (వీడియో)

ఓ వ్యక్తి రేషన్‌ దుకాణంలో సరకులు తీసుకునేందుకు ఏకంగా బెంజి కారులో వచ్చిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌లో ఈ ఘటన జరిగింది. హోషియార్‌పుర్‌లోని ఓ ప్రభుత్వ రేషన్‌ దుకాణం ముందు ఓ లగ్జరీ మెర్సిడెస్‌ బెంజ్‌ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఓ వ్యక్తి దిగి నేరుగా రేషన్ దుకాణంలోకి వెళ్లాడు. తన బీపీఎల్‌ కార్డు చూపించి సరకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ సంచులను కారు డిక్కీలో పెట్టించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఆ వ్యక్తి రేషన్‌ దుకాణం నుంచి కారులో సరకులు తీసుకెళ్తోన్న వీడియోను కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఇది కాస్తా తీవ్ర దుమారం రేపింది. ఈ వీడియో కాస్తా తీవ్ర వివాదానికి దారితీయడంతో ఆ బెంజి కారులో వచ్చిన వ్యక్తి స్పందించాడు. ఆ కారు తమ బంధువులదని, వారు విదేశాలకు వెళ్లడంతో కారును తమ ఇంటి ముందు పార్క్‌ చేసి వెళ్లారని చెప్పాడు. అందుకే అప్పుడప్పుడు ఆ కారును తాను ఉపయోగిస్తున్నానని చెప్పాడు.

#Punjab person arrived in a Mercedes to buy free wheat under the Ata Dal scheme by Punjab Government. A video of #Hoshiarpur Naloyan Chowk is going viral pic.twitter.com/9WHYN6IOaq— Parmeet Singh Bidowali (@ParmeetBidowali) September 6, 2022