లలిత్ మోదీ-సుష్మితా సేన్ బ్రేకప్ కు కారణం అతడే ?

ఐపీఎల్ వ్యవస్థాపకులు లలిత్ మోడీతో మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరు పెట్టిన పోస్టులు, షేర్ చేసిన ఫోటోలతో ఆ విషయం కన్ ఫామ్ చేసుకున్నారు నెటిజన్లు. అంతేకాదు.. తామిద్దరం ప్రేమలో ఉన్నామంటూ లలిత్ మోదీనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే ఇటీవల వీరు బ్రేకప్ చెప్పేసుకున్నట్టు సమాచారం.

తాజాగా ఆయన సుష్మితా పేరును ఇన్‌స్టాలో తీసివేయడమే కాకుండా డీపీని కూడా తొలగించారు. ఇన్‌స్టా ప్రొఫైల్‌లో మార్పులు చేయడంతో లలిత్ మోదీ సుష్మితా సేన్‌తో విడిపోయారని నెటిజన్లు భావిస్తున్నారు.అయితే లలిత్ మోదీ- సుష్మితా సేన్ విడిపోవడానికి ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ కారణమని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా సుష్మితా.. తన మాజీ ప్రియుడు రోహమన్‌తో కలిసి సనినిమాలకు, షాపింగ్ మాల్స్‌కు వెళ్తోంది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని బాహాటంగానే తిరగుతుండటంతో లలిత్ మోదీ.. సుష్మితాకు బ్రేకప్ చెప్పారని స్పష్టమవుతోంది.