పుష్ప కోసం రస్మిక రెడీ

నేషనల్ క్రష్ రష్మికా మందన్నా పుష్ప-2 సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని తెలియజేసింది. మరో రెండు రోజుల్లో తాను ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టనున్నట్లు స్పష్ట చేసింది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, హిందీ.. అన్నింట్లోనూ దూసుకుపోతుంది. వరుసగా చిత్రాలు చేస్తోంది. ఆమె నటించిన బాలీవుడ్ సినిమా ‘గుడ్ బై’ ఇటీవల విడుదలైంది.

ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా రష్మిక కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇందులో భాగంగా పుష్ప-2 సినిమా గురించి కూడా అప్డేట్ ఇచ్చింది. మరో రెండు రోజుల్లో నేను పుష్ప-2 సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నానని చెప్పింది. ఇక గుడ్ బై సినిమాలో రష్మికా మందన్నాకు అమితాబ్ తండ్రిగా కనిపించనున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఫీల్ గుడ్ మూవీ జోనర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం అక్టోబరు 7న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.