విలేకర్ల తీరుపై రెజీనా అసహనం
రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శాకిని డాకిని’. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం రెజీనా, నివేదా కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విలేకరి.. ‘మేడమ్ ఈ సినిమాలో మీరు ఓసీడీ(అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) ఉన్నట్లు కనిపించారు. నిజ జీవితంలో కూడా మీకు అలా ఓసీడీ ఉందా?’ అని ప్రశ్నించాడు.
విలేకరి అడిగిన ప్రశ్నతో రెజీనా ఇబ్బందికి గురయ్యారు. ‘‘అందర్నీ మీరు ఇలాగే ప్రశ్నిస్తారా? సినిమాలో మేము కేవలం నటిస్తున్నామంతే. పాత్ర డిమాండ్ చేయడం వల్లే మేము అలా చేస్తాం. మీ వద్ద ఇలాంటి ప్రశ్నలే ఉన్నాయా? అమ్మాయిల్ని చాలా గొప్పగా చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఓసీడీ లాంటి సైకలాజికల్ డిజార్డర్ నాకేమీ లేదని సమాధానం ఇచ్చారు. ప్రెస్ మీట్ సమయంలో విలేకర్ల సెల్ ఫోన్స్ పదే పదే రింగ్ అవ్వడంపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు.