అసెంబ్లీ నుండి ఈటల సస్పెండ్.. అరెస్ట్ !

సీనియర్ నేత, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అసెంబ్లీ నుండి సస్పెండ్ అయ్యారు. ఈ ఉదయం అసెంబ్లీ కొలువుదీరిన.. వెంటనే ఇటీవల స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ని  ఉద్దేశించి ఈటల చేసిన ‘రోబో’ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. స్పీకర్ కు క్షమాపణలు చెప్పాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి కోరారు. లేదంటే.. తదుపరి చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు.

అయితే ఈటల మాత్రం ఏం బెదిరిస్తున్నారా ? అంటూ తన వెర్షన్ ను  వినిపించే ప్రయత్నం చేశారు. అయితే సబ్జెక్టు గురించి తర్వాత మాట్లాడొచ్చు. ప్రస్తుతం వన్ వర్డ్ లో సారీ చెప్పాలని పదే పదే డిమాండ్ చేశారు టీఆర్ఎస్ వర్గాలు. ఆఖరికి ఈటలను సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి మోషన్ జారీ చేయడం.. దానికి స్పీకర్ ఓకే చేయడం క్షణాల్లో జరిగిపోయాయి. 

ఇక అసెంబ్లీ నుండి బయటకు వచ్చిన ఈటల ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. తాను పార్టీ ఆఫీసుకు వెళ్తానని చెప్పినా.. వినకుండా పోలీస్ వాహనంలో ఎక్కించుకొని వెళ్లారు. మొదట ఇంట్లో దింపుతామని చెప్పినా.. అందుకు ఈటల అంగీకరించలేదు. తాను పార్టీ ఆఫీస్ కు వెళ్తానని పట్టుబట్టడంతో.. అక్కడికి తీసుకెళ్లి వదిలిపెట్టారు. అయితే ఈ దఫా అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈటల వాయిస్ వినిపించకుండా చేసేందుకు టీఆర్ ఎస్ ప్రీ ప్లాన్ తో ఉందనే ప్రచారం ముందు నుండి జరుగుతోంది. ఇప్పుడు అదే నిజమైంది.