అరుదైన చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సమంత ?

సమంత అరుదైన చర్మ సంబంధిత వ్యాధితో ఇబ్బందిపడుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకే ఆమె కొన్నాళ్లుగా బయట కనిపించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. న్‌లైన్, ఆఫ్‌లైన్‌లో తరచూ యాక్టివ్‌గా ఉండే సమంత (Samantha) గత నెల రోజుల నుంచి అన్నింటికీ దూరంగా ఉన్నారు. సినిమా ఫంక్షన్స్‌లో కానీ, యాడ్ షూట్స్‌లో కానీ ఆమె కనిపించలేదు. ఈ క్రమంలోనే ఆమె అనారోగ్యానికి గురైనట్లు సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ వార్తలపై ఆమె మేనేజర్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని చెప్పుకొచ్చారు. సామ్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని బదులిచ్చారు. అయితే, సామ్ యూఎస్‌కు ఎందుకు వెళ్తున్నారనే విషయంపై మాత్రం ఆయన స్పందించలేదు.