ఐసీసీఐ టీ20 ర్యాంకింగ్స్ టాప్-3 లోకి సూర్య

ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్ మెన్ సూర్య కుమార్ యాదవ్ టాప్ -3లోకి వచ్చేశారు. పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను అధిగమించి మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో మొదటి టీ20లో సూర్యకుమార్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన విషయం తెలిసిందే. మొహాలీ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌ లో 25 బంతులు ఎదుర్కొన్న సూర్య.. రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 46 పరుగులు సాధించాడు. పాకిస్తాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక ఎయిడెన్‌ మార్కరమ్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ తాజా ర్యాంకింగ్స్‌ టాప్‌-5  లిస్ట్ “

  1. మహ్మద్‌ రిజ్వాన్‌(పాకిస్తాన్‌)
  2. ఎయిడెన్‌ మార్కరమ్‌(దక్షిణాఫ్రికా)
  3. సూర్యకుమార్‌ యాదవ్‌(ఇండియా)
  4. బాబర్‌ ఆజం(పాకిస్తాన్‌)
  5. డేవిడ్‌ మలన్‌(ఇంగ్లండ్‌)