చిరు- సల్మాన్‌ కలిసి స్టెప్పేస్తే.. తార్‌ మార్‌ తక్కర్‌ మార్‌ !

 ‘గాడ్‌ ఫాదర్‌’ తొలి పాట ‘తార్‌ మార్‌ తక్కర్‌ మార్‌’ వచ్చేసింది. చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌  ఇద్దరూ ఓ రేంజ్‌లో డ్యాన్స్‌ చేసినట్టు వీడియోలోని క్లిప్పింగ్స్‌ చూస్తే తెలుస్తోంది. అనంత శ్రీరామ్‌ రాసిన ఈ గీతాన్ని శ్రేయా ఘోషల్‌ పాడారు. తమన్‌ సంగీతం అందించారు.

చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కిస్తున్న చిత్రమిది. మలయాళ చిత్రం ‘లూసీఫర్‌’కు రీమేక్‌గా రూపొందుతున్న ‘గాడ్‌ఫాదర్‌’లో సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాని రామ్‌ చరణ్‌, ఎన్‌. వి. ప్రసాద్‌, ఆర్‌. బి. చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.