రూపాయి విలువ పతనం.. కేటీఆర్ సెటైర్

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయి కనిష్ఠానికి(₹81.18)కి పడిపోవడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

“రూపాయి విలువ అత్యంత కనిష్ఠానికి పడిపోయింది. అయినప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి రేషన్‌ దుకాణాల్లో ప్రధాని ఫొటో కోసం వెతుకుతున్నారు. పైగా రూపాయి విలువ సాధారణంగానే పడిపోయిందని చెబుతున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం.. ఇలా అన్ని అర్థిక అవరోధాలకు ‘యాక్ట్స్‌ ఆఫ్‌ గాడ్‌’ కారణమని చెప్పారు. విశ్వగురువును పొగడండి” అంటూ రాసుకొచ్చారు.